News January 2, 2026

మహిళల కోసం కొత్త స్కీమ్.. వివరాలివే

image

TG: మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం(D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం ₹1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹60వేలు బ్యాంకులు లోన్ ఇస్తాయి.

Similar News

News February 16, 2026

నిమ్స్‌లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్!

image

TG: నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీరిలో స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్, పారా మెడికల్ సిబ్బంది ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 125 వెంటిలేటర్లు మంజూరు చేయగా రూ.1,698 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ గ్రాంట్లు పెరగగా ఏడాదిలోనే రూ.122 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చాయి.

News February 16, 2026

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రుళ్లే ఎందుకు?

image

పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా రాత్రి వేళ లేదా తెల్లవారుజామునే ఉంటాయి. అందుకు ప్రధాన కారణం అరుంధతీ నక్షత్ర దర్శనం. ఆకాశంలో దర్శనమిచ్చే అరుంధతి, వశిష్ఠుల జంట అన్యోన్యత, పాతివ్రత్యానికి ప్రతీక. వారిలా వధూవరులు నూరేళ్లు వర్ధిల్లాలని పురోహితులు ఈ నక్షత్రాన్ని చూపిస్తారు. ఈ నక్షత్రం అర్థరాత్రి/తెల్లవారుజామునే కనిపిస్తుంది. అందుకే ఆ నక్షత్ర దర్శనం సాధ్యమయ్యే సమయాల్లోనే ముహూర్తాలు నిర్ణయిస్తారు.

News February 16, 2026

సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

<>సెంటర్<<>> సిల్క్ బోర్డ్‌ 28 సైంటిస్ట్-B పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(FEB 18). BTech/BE(టెక్స్‌టైల్ ఇంజినీరింగ్& ఫైబర్ సైన్స్) అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. GATE-2025 స్కోరు, ఇంటర్వ్యూ /పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.56,000-1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://csb.gov.in/