News January 5, 2026

మహిళల భద్రతకు ‘పోష్‌’ కమిటీలు తప్పనిసరి: కలెక్టర్

image

పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నివారించేందుకు ‘పోష్’ చట్టం-2013ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. 10 మంది కంటే ఎక్కువ సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలని, అందులో సగం మంది మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రైవేట్ సంస్థలు నెల రోజుల్లోగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని గడువు విధించారు.

Similar News

News January 6, 2026

ఖమ్మం: ఇటుక బట్టీల్లో వలస బతుకులు ఛిద్రం

image

ఖమ్మం జిల్లాలోని ఇటుక బట్టీల్లో వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. ఒడిశా నుంచి పిల్లాపాపలతో వచ్చిన వందలాది కుటుంబాలు కనీస వసతులు లేని గుడారాల్లో ఉంటూ గొడ్డుచాకిరి చేస్తున్నాయి. ప్రమాదాలు పొంచి ఉన్నా యజమానులు రక్షణ చర్యలు చేపట్టడం లేదని, అధికారుల పర్యవేక్షణ కరవైందని విమర్శలు వస్తున్నాయి. ‘ఆపరేషన్ స్మైల్’ వంటి కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

News January 6, 2026

యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.

News January 6, 2026

ఖమ్మం జిల్లాకు 72 వసంతాలు.. 51 మంది కలెక్టర్ల ప్రస్థానం

image

ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పరిపాలనా ప్రస్థానాన్ని అధికారులు గుర్తుచేసుకున్నారు. 1953 OCT 1న జిల్లా ఏర్పడగా, ఇప్పటివరకు 51మంది కలెక్టర్లు సేవలందించారు. తొలి కలెక్టర్‌గా జి.వి. భట్ బాధ్యతలు చేపట్టగా, ప్రస్తుతం అనుదీప్ దురిశెట్టి కొనసాగుతున్నారు. వీరిలో ఎ. గిరిధర్ అత్యధికంగా 4 ఏళ్ల 21 రోజుల పాటు కలెక్టరుగా పనిచేసి రికార్డు సృష్టించారు.