News September 1, 2025

మహిళల భద్రతకై రక్షణక ADB షీ టీం

image

మహిళల భద్రతకై రక్షణకు ఆదిలాబాద్ జిల్లా షీ టీం బృందం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో రాత్రి సమయాల్లో ఆకతాయిలు అల్లరి చేస్తూ మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏప్రిల్ నెలలో షీ టీం బృందాల ద్వారా 3 ఎఫ్ఐఆర్ కేసులు, 18 ఈ పెట్టీ కేసుల నమోదు చేసిందని పేర్కొన్నారు.

Similar News

News September 2, 2025

ADB: ఈనెల 6న ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు

image

ADB: జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో ఈనెల 6వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీవైఎస్ఓ శ్రీనివాస్ తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునే ఉద్యోగులు ఈనెల 4వ తేదీన సాయంత్రం 5 గంటల్లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9440765485, 9494956454 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News September 2, 2025

గణపతి పూజల్లో ADB జిల్లా అధికారులు

image

ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రతిష్ఠించిన గణనాథుడికి కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నీతిక పంత్, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఎఎస్పీ కాజల్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదానం కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు కొనసాగుతున్నాయని తెలిపారు.

News September 2, 2025

18న రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు

image

ADB రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న రిమ్స్ డైరెక్టర్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని రిమ్స్ డైరెక్టర్ డా.జైసింగ్ రాథోడ్ తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులు ఇతర వివరాలను rimsadilabad.org వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.