News December 27, 2025

మహిళల రక్షణకు 30 మందితో 5 శక్తి టీమ్స్: VZM SP

image

మహిళల రక్షణ కోసం జిల్లాలో 30 మందితో ఐదు ‘శక్తి టీమ్స్’ ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒక్కో బృందానికి ఎస్ఐ నాయకత్వం వహిస్తారని, మఫ్టీలో విధులు నిర్వహిస్తూ వేధింపులపై తక్షణ చర్యలు తీసుకుంటారన్నారు. శక్తి యాప్‌పై అవగాహన, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2025

పిల్లలే దేశ భవిష్యత్‌కు పునాది: VZM కలెక్టర్

image

వీర్ బాల్ దివస్ వేడుకలు విజయనగరం జిల్లాలో శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణితో కలిసి జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా వీర్ బాల్ దివస్‌కు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాది అని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 25, 2025

పిట్ ఎన్డీపీఎస్ చట్టం ఎప్పుడు ప్రయోగిస్తారంటే?

image

➤గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలను ముందస్తుగా అడ్డుకోవడానికి తీసుకొచ్చిన కఠిన చట్టం.
➤నిందితుడిని కోర్టు విచారణ లేకుండానే ముందస్తు నిర్బంధం చేయవచ్చు.
➤సమాజానికి ప్రమాదంగా మారిన వారిపై మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.
➤గరిష్ఠంగా ఏడాది వరకు జైలులో నిర్బంధం చేయవచ్చు.
➤శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు ముప్పు ఉంటే ప్రభుత్వం ఈ చట్టం అమలు చేస్తుంది.