News January 19, 2026

మహిళల స్వావలంబనకే ప్రభుత్వ ప్రాధాన్యం: అడ్లూరి

image

మహిళల ఆర్థిక స్వావలంబనకే ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలు అందించి స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళా సంక్షేమానికి పథకాలు అమలు చేస్తూ కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Similar News

News January 26, 2026

నేడు గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

గిగ్ వర్కర్లు ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వంటి యాప్‌ల సేవలు నిలిచిపోనున్నాయి. వర్కర్లందరూ యాప్‌ల నుంచి లాగౌట్ చేసి నిరసన చేపట్టనున్నట్లు గిగ్&ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రకటించింది. దీంతో డెలివరీ సేవలు నిలిచిపోవడం లేదా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే Feb 3న మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

News January 26, 2026

గుంటూరు: 350 మందికి అవార్డులు

image

గుంటూరు జిల్లా కేంద్రంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, వైద్యులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, గ్రామ స్థాయి సిబ్బందికి అవార్డులు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో 351 మందికి పైగా అవార్డులు పొందనున్నట్లు వెల్లడైంది. ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని సత్కరించనున్నారు.

News January 26, 2026

సింగరేణిలో రూ.6 వేల కోట్ల కుంభకోణం: కొప్పుల ఈశ్వర్‌

image

సింగరేణిలో సైట్‌ విజిట్‌ పేరుతో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని టీబీజీకేఎస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు రూ.6,000 కోట్ల మేర కుంభకోణం జరిగిందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, తదితరులు పాల్గొన్నారు.