News December 23, 2025

మహిళా క్రికెటర్ల ఫీజులు భారీగా పెంపు

image

భారత మహిళా క్రికెటర్ల ఫీజులను BCCI భారీగా పెంచింది. ఇకపై వన్డేలతో పాటు మల్టీ డే మ్యాచులకు ఓ రోజుకు(ప్లేయింగ్ 11) రూ.50 వేలు చెల్లించనున్నారు. స్క్వాడ్‌లోని సభ్యులకు రూ.25 వేలు, రిజర్వ్ ప్లేయర్లకు రూ.12,500 అందించనున్నారు. అదే T20 అయితే రూ.25వేలు చెల్లించనున్నారు. రిజర్వ్‌లో ఉన్నవారికి రూ.12,500 దక్కనుంది. ప్రస్తుతం వీరికి ప్లేయింగ్ 11లో రూ.20 వేలు, బెంచ్ మీద ఉంటే రూ.10వేలు చెల్లిస్తున్నారు.

Similar News

News December 24, 2025

ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్‌లో కీలక సమాచారం?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీటిని ప్రభాకర్ రావు ముందుంచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు బృందం ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి చాలా వరకు ఆధారాలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్‌ కీలకం అవుతోంది.

News December 24, 2025

చరిత్రలో తొలిసారి.. వన్డేల్లో 574 పరుగులు

image

విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే సంచలనం నమోదైంది. వన్డే హిస్టరీలోనే తొలిసారి బిహార్ జట్టు 500 పరుగులు చేసింది. 45 ఓవర్లలోనే ఆ మైలురాయిని చేరుకుంది. మొత్తంగా 50 ఓవర్లలో 574/6 స్కోర్ చేసింది. వైభవ్ 190(84), ఆయుష్ 116(56), సకిబుల్ గని 128*(40B), పీయూష్ సింగ్ 77 ఆకాశమే హద్దుగా చెలరేగారు. గని 32 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్టు A క్రికెట్‌లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.

News December 24, 2025

ఆలయాల్లో ‘వైకుంఠ ఏకాదశి’ ఏర్పాట్లు: TTD

image

AP: వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీ దృష్ట్యా TTD అనుబంధ ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలు సహా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. అమరావతి, VSP, HYD, బెంగళూరు, ఒంటిమిట్ట, నందలూరు, దేవుని కడప, జమ్మలమడుగు, తాళ్లపాక, పిఠాపురం, రాజంపేట తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు TTD పేర్కొంది. 30న తెల్లవారుజాము 1.35 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అవుతాయి.