News March 8, 2025

మహిళా గళం.. అసెంబ్లీలో తగ్గేదేలే!

image

అసెంబ్లీలో జిల్లా మహిళా ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారు. ఆసక్తికర స్పీచులతో ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు. MLAలు <>బండారు<<>> శ్రావణి, <<15671355>>సింధూరరెడ్డి<<>>, మంత్రి <<15678997>>సవిత<<>> ఏమాత్రం బెరుకు లేకుండా గళం విప్పుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక సీనియర్ నేత పరిటాల <<15680752>>సునీత<<>> ప్రత్యర్థులకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు.
#Women’sDay

Similar News

News July 9, 2025

MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

image

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.

News July 9, 2025

రైతుబజార్‌ను వినియోగించుకోవాలి: సిరిసిల్ల డీఏవో

image

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతుబజార్‌ను కూరగాయలు, మటన్, చికెన్, చేపల విక్రయదారులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్‌బేగం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతుబజార్‌లోకి తరలించేందుకు అవసరమైన షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. అదే విధంగా ఈ రైతుబజార్‌లోకి మాంసం షాప్‌లను సైతం తరలించాలని చెప్పారు.

News July 9, 2025

ఓయూ బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. బీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 24లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని సూచించారు. రూ.200 లేట్ ఫీతో ఈ నెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.