News March 2, 2026

మహిళా దినోత్సవం వేళ క్రీడా పోటీలు

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న జిల్లాలో మహిళలకు ప్రత్యేక ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు డీవైఎస్‌ఓ వెంకట నర్సయ్య తెలిపారు. సోమవారం జిల్లా యువజన అధికారి రంజిత్ రెడ్డితో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ పోటీలను 13 ఏళ్లలోపు, 18 ఏళ్లలోపు మరియు 18 ఏళ్లు పైబడిన వారికి మూడు విభాగాల్లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల మహిళలు, యువతులు నేరుగా స్టేడియంకు వచ్చి పాల్గొనాలని ఆయన కోరారు.

Similar News

News March 6, 2026

సివిల్స్‌లో సత్తా చాటిన ఉమ్మడి రంగారెడ్డి బిడ్డలు

image

సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రం నుంచి ఎంపికైన మొత్తం 20 మందిలో 8 మంది మన జిల్లాలకు చెందిన వారే కావడం విశేషం. లక్ష్మిరచన 178వ ర్యాంక్, మెరుగు కౌశిక్ 399, ప్రీతీ రాపర్తి 468, విక్రమ్ సింహా రెడ్డి 682, విజయ్ సింహా రెడ్డి 682, శ్రీరామ్ హర్ష 823, ప్రత్యూష 908, దీపక్ శర్మ 951, ఉత్తమ ర్యాంకులు సాధించారు.

News March 6, 2026

కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలి: జలగం ప్రసాదరావు

image

ఎన్పీడీసీఎల్ ఈఆర్సీ మీటింగ్‌లో మాజీమంత్రి జలగం ప్రసాదరావు పాల్గొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా కొరకు కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నారు. సబ్ స్టేషన్‌లో పూర్తిగా ఆపరేటర్లను నియమించాలని, కొత్తగా 220 కేవీ నుంచి 33 కేవీ కొత్త లైన్ కమలాపూర్ వరకు ఏర్పాటు చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం గుండాలలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మించాలన్నారు.

News March 6, 2026

రూ.9.8 లక్షల కోట్ల ఆస్తితో ముకేశ్ నంబర్-1

image

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2026లో IND నుంచి ముకేశ్ అంబానీ(రిలయన్స్ ఇండస్ట్రీస్) ₹9.8 లక్షల కోట్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో గౌతమ్ అదానీ(₹7.5L Cr), రోష్నీ నాడార్ మల్హోత్రా-HCL(₹3.2L Cr), పూనావాలా-సీరమ్ ఇన్‌స్టిట్యూట్(₹3L Cr), కుమార మంగళం బిర్లా-ఆదిత్య బిర్లా(₹2.5L Cr), దిలీప్ సంఘ్వీ-సన్ ఫార్మా(₹2.3L Cr), అజీమ్ ప్రేమ్‌జీ-విప్రో(₹2.3L Cr), నీరజ్-బజాజ్ ఆటో(₹2.2L Cr) ఉన్నారు.