News March 4, 2025
మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో మహిళా దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావులు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ వారోత్సవాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారోత్సవాల నిర్వహణ నోడల్ అధికారిగా ఐసీడీఎస్ పీడీ ఉమదేవిని నియమించారు.
Similar News
News March 4, 2025
మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారు: సీపీ

మహిళలను గౌరవించే చోట దేవతలు కొలువై ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ విభాగాల పోలీసు మహిళా అధికారులు పాల్గొన్నారు.
News March 4, 2025
కృష్ణా: తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్

రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ గ్రామీణ నీటి సరఫరా, మున్సిపల్, ఇరిగేషన్, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
News March 4, 2025
దేశం కోసం ప్రకాశం జిల్లా వాసి ప్రయత్నం!

ఒక నినాదం కోసం వేల మైళ్లు సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకాశం జిల్లా వాసి. ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ అంటూ రుద్రవరం వాసి సుభాశ్ చంద్రబోస్ ప్రజలను చైతన్య పరుస్తున్నాడు. ఏకంగా 50 వేల కి.మీ యాత్రలో భాగంగా 28 రాష్ట్రాలను చుట్టేశాడు. 41,223 కి.మీ సైకిల్ తొక్కి విశాఖ చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన చొరవతో రాష్ట్రపతికి ‘ఫ్యూచర్ ఆఫ్ ఇండియా’ డాక్యుమెంటరీ అందజేయడం తన లక్ష్యమంటున్నాడీ కుర్రాడు.