News March 6, 2025
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో డీఆర్డీఏ, మెప్మా, స్కిల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ ప్రభుత్వ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు.
Similar News
News November 11, 2025
తిరుమల: ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్‌మెంట్ రికార్డు

పరకామణి చోరీ కేసులో సోమవారం ముగ్గురు పోలీసులను CID బృందం విచారణ చేపట్టింది. కేసులో ఉన్న మాజీ CI జగన్ మోహన్ రెడ్డి, SI లక్ష్మీపతి, విజిలెన్స్ అధికారి గిరిధర్‌ను విచారించారు. కేసు సెక్షన్లు ఏవీ, ఎందుకు పెట్టారు, అరెస్టు ఎందుకు చేయలేదు, రాజీ ఎలా చేశారు, లోక్ అదాలత్‌లో ఎవరు చెబితే పెట్టారనే ప్రశ్నలు వేసి వారి సమాధానాలను రికార్డు చేశారు.
News November 11, 2025
HNK నుంచి తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

WGL జిల్లా భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నాయని టీజీఆర్టీసీ RM డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలంకు, ఉదయం 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంకు, రాత్రి 11.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
News November 11, 2025
తాకట్టు పత్రాలు ఇవ్వని ఎస్‌బీఐకి భారీ జరిమానా

రుణం తీరినా ఆస్తి పత్రాలు ఇవ్వని వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఎస్‌బీఐ బ్యాంకుపై కన్స్యూమర్ కోర్టు చర్యలు తీసుకుంది. వినియోగదారుడు డి. మల్లేశం ఫిర్యాదు మేరకు.. పత్రాలు ఇచ్చేవరకు రోజుకు రూ.5 వేలు, మానసిక వేదనకు రూ.లక్ష, కోర్టు ఖర్చులుగా రూ.25 వేలు చెల్లించాలని బ్యాంకును కోర్టు ఆదేశించింది.


