News January 28, 2026
మహిళా పైలట్‌పై అజిత్ పవార్ ట్వీట్.. వైరల్

మహారాష్ట్రలో జరిగిన <<18980548>>ప్రమాదంలో<<>> అజిత్ పవార్‌తోపాటు మహిళా పైలట్ శాంభవీ పాఠక్ మరణించడం తెలిసిందే. ఈ క్రమంలో రెండేళ్ల కిందట ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘మనం హెలికాప్టర్ లేదా విమానంలో ప్రయాణించేటప్పుడు సజావుగా ల్యాండ్ అయితే.. పైలట్‌గా ఉన్నది ఓ మహిళ అని అర్థం చేసుకోవాలి’ అని 2024 జనవరి 18న ఆయన ట్వీట్ చేశారు. #NCPWomenPower అని హాష్‌ట్యాగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Similar News
News February 10, 2026
HYD ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 50% HRA ఎగ్జెంప్షన్!

కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం పాత పన్ను పద్ధతిలో ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇప్పుడు కేవలం ఢిల్లీ, ముంబై వంటి నగరాలకే పరిమితమైన 50% HRA ఎగ్జెంప్షన్ ఇకపై హైదరాబాద్, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్‌కూ వర్తించనుందని సమాచారం. అంటే కట్టే రెంట్‌లో ఎక్కువ భాగాన్ని ట్యాక్స్ ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.
News February 10, 2026
చెరువుల్లో చేపల మరణానికి ప్రధాన కారణం ఇదే

చెరువుల్లో చేపల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఎక్కువ సంఖ్యలో చేపల మరణాలు. దీనికి వ్యాధులే కారణమని చాలా మంది పెంపకందారులు భావిస్తుంటారు. అయితే చెరువుల్లో నీటి నాణ్యత, సరైన నిర్వహణ లేకపోవడం వల్లే 60-70% చేపల మరణాలు సంభవిస్తున్నాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే చేపల పెంపకందారులు చెరువుల్లో నీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.