News March 6, 2025
మహిళా శక్తి పథకం గ్రౌండింగ్ పనులను పూర్తి చేయండి

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలోని 16 రకాల యూనిట్ల గ్రౌండింగ్ వంద శాతం పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా గ్రామీణభివృద్ధి శాఖ అధికారులతో మహిళా శక్తి పథకం యూనిట్ల లక్ష్యం, బ్యాంక్ లింకేజీ రుణాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మహిళలని ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని ఉద్దేశమన్నారు.
Similar News
News November 13, 2025
IRCTCలో 46 ఉద్యోగాలు

<
News November 13, 2025
మెన్‌స్ట్రువల్ కప్‌తో ఎన్నో లాభాలు

ఒక మెన్‌స్ట్రువల్ కప్ పదేళ్ల వరకూ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇది 2,500 శ్యానిటరీ ప్యాడ్స్‌తో సమానం. అలాగే 12 గంటల వరకు లీకేజీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ కప్ ఉపయోగిస్తున్నప్పుడు వ్యాయామం చేయడం, ఈత కొట్టడం, గెంతడం, రోప్ స్కిప్పింగ్ అన్నీ చేసుకోవచ్చంటున్నారు. అలాగే ప్యాడ్స్ వాడినప్పుడు కొన్నిసార్లు వెజైనల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ మెన్‌స్ట్రువల్ కప్‌తో ఆ ఇబ్బంది ఉండదంటున్నారు నిపుణులు.
News November 13, 2025
కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీ మృతి

కడపలోని కేంద్ర కారాగారంలో ఉన్న జీవిత ఖైదీ గురువారం గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసుల కథనం.. కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న చిన్న సుంకిరెడ్డికి ఉదయం గుండెపోటు వచ్చింది. దీంతో కడప రిమ్స్‌కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు నంద్యాల జిల్లా కోవెలకుంట్ల(M) భీమునిపాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.


