News September 11, 2025
మహిళా సాధికారత కమిటీ సమావేశంలో డీకే అరుణ

ఢిల్లీలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో మహిళా సాధికారత కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈనెల 14, 15న మహిళా సాధికారత కమిటీ స్టడీ టూర్ నేపథ్యంలో APలో తిరుపతి వేదికగా కమిటీ కీలక సమావేశం నిర్వహించనుంది. 2025లో ఎన్నికైన సభ్యుల పోర్టల్ ద్వారా క్షేత్ర స్థాయి సమాచారం, పరిస్థితులపై అధ్యయనం చేయనున్నారు.
Similar News
News September 11, 2025
కాసేపట్లో జైలులో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాసేపట్లో రాజమండ్రి జైలులో సరెండర్ కానున్నారు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియనుండటంతో నేటి సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ కానున్నారు. ఇప్పటికే ఆయన విజయావాడకు చేరుకుని రాజమండ్రికి బయలుదేరారు.
News September 11, 2025
4.61 ఎకరాలకు రూ.3,472 కోట్లు!

ముంబైలో RBI భారీ ధరకు 4.61 ఎకరాలను కొనుగోలు చేసింది. నారీమన్ పాయింట్‌లో ఉన్న ప్లాట్ కోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ (MMRCL)కు ఏకంగా రూ.3,472 కోట్లు చెల్లించింది. అంటే ఒక ఎకరానికి దాదాపు రూ.800 కోట్లు. స్టాంప్ డ్యూటీకే రూ.208 కోట్లు అయ్యాయి. ఈ ఏడాది ఇండియాలో ఇదే అతిపెద్ద ల్యాండ్ ట్రాన్సాక్షన్ అని సమాచారం. ఆ ప్లాటు సమీపంలోనే బాంబే హైకోర్టు, ఇతర కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి.
News September 11, 2025
గురుకులాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని ఈ సందర్భంగా సూచించారు. పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును పరిశీలించి, పలు సూచనలు చేశారు.