News March 2, 2025
మహిళా సిబ్బందికి యోగా తరగతులు: ఎస్పీ

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో మహిళా పోలీసు సిబ్బందికి ఆదివారం ప్రత్యేకంగా యోగా తరగతులను నిర్వహించినట్లుగా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. యోగ అనేది శరీరానికి, మనస్సుకి, ఆత్మకు శాంతి కలిగించే ప్రాచీనమైన సాధన అని అన్నారు. యోగ తరగతులు మహిళాలకు ఉపయోగకరమన్నారు.
Similar News
News March 3, 2025
VZM: అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సమీక్ష

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఈవోపీఆర్డీలతో సమీక్ష జరిపి ఆయా శాఖల పనితీరుపై ఆరా తీశారు. గ్రామాలు, పట్టణాల్లో తాగునీరు, ఉపాధి హామీ, ఎంఎస్ఎంఈ సర్వే, తదితర అంశాలపై చర్చించారు. వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు.
News March 3, 2025
మానస.. ఆత్మ స్థైర్యానికి సెల్యూట్..!

చదవాలన్న సంకల్పం ముందు మానసిక అంగవైకల్యం తలవంచింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వి.ఎం.పేటకు చెందిన పెట్ల మానస ఇంటర్ పరీక్షలకు హాజరైంది. చిన్నప్పటి నుంచి మానసికస్థితి సరిగా లేకపోయినా తల్లిదండ్రుల సాయంతో చదువు కొనసాగిస్తోంది. ప్రస్తుతం HEC సెకండియర్ చదువుతున్న మానస.. తన తండ్రి దేముడు సాయంతో సోమవారం పరీక్షకు హాజరయ్యింది. సహాయకురాలి సాయంతో పరీక్ష రాసింది. ఆమె ఆత్మ స్థైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.
News March 3, 2025
VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.