News March 18, 2025

మహిళ డెడ్‌బాడీ.. అనకాపల్లి ఎస్పీకి హోం మంత్రి ఫోన్

image

కసింకోట మండలం బయ్యవరం గ్రామం వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంగళవారం మంత్రి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హాతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే విచారణ నిర్వహించి నిందితులను అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు.

Similar News

News March 18, 2025

దాకమర్రి లేఅవుట్ ధర తగ్గింపు: VMRDA ఎంసీ 

image

విజయనగరానికి దగ్గరలో దాకమర్రి లే అవుట్‌లో స్థలాల ధరలను గజం రూ.20వేల నుంచి రూ.15,500 తగ్గించినట్టు VMRDA ఎంసీ విశ్వనాథన్ తెలిపారు. నివాస స్థలాలు ధరలు ప్రజలకు అందుబాటులో ఉంచడం కోసం ప్రభుత్వం ధరలను తగ్గించిందని చెప్పారు. ఈ లేఅవుట్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.

News March 18, 2025

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాల పనివేళలు ఇవే.. 

image

అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.

News March 18, 2025

NTR జిల్లా పేరు ఎందుకు మార్చలేదు?: షర్మిల

image

AP: చంద్రబాబు తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఉందని షర్మిల అన్నారు. ‘NTR పేరును జగన్ మారిస్తే, YSR పేరు మార్చి CBN ప్రతీకారం తీర్చుకుంటున్నారు. YSR జిల్లాను YSR కడప జిల్లాగా సవరించడంలో అభ్యంతరం లేదు. తాడిగడప మున్సిపాలిటీకి YSR పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నాం. NTR జిల్లా పేరును NTR విజయవాడగా లేదా పాత కృష్ణా జిల్లా పేరును NTR కృష్ణా జిల్లాగా ఎందుకు మార్చలేదు?’ అని ప్రశ్నించారు.

error: Content is protected !!