News March 19, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష

మహిళ హత్య కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి చెప్పారు. 2013 మార్చి నెలలో రాణి అనే మహిళను రాజశేఖర్ అనే వ్యక్తి బాపట్ల మండలం అడవి పంచాయతీలోని శిథిలావస్థలో ఉన్న భవనంలో కత్తితో దాడి చేసి హత్య చేశాడన్నారు. బుధవారం న్యాయస్థానం నిందితుడికి శిక్షను ఖరారు చేసిందన్నారు. శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News March 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 20, 2025
విశాఖలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు

విశాఖ జిల్లాలో గురువారం నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం తెలిపారు. రేపటి నుంచి మార్చి 22 వరకు, మార్చి 25 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. ఆధార్ క్యాంపుల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని సచివాలయాల్లో, కామన్ సర్వీస్ సెంటర్‌లో ఆధార్ సేవలు అందుతాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 20, 2025
నిబంధనలు పాటించని లారీలు సీజ్: కలెక్టర్

నిబంధనలు పాటించని రాయిలోడుతో వెళ్లే వాహనాలను సీజ్ చేస్తామని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లో అధికారులు, క్వారీ లారీల యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల క్వారీ లారీల కారణంగా ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. వీటి వల్ల రైల్వే ట్రాక్ దెబ్బతిన్నలతో రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడిందన్నారు.