News December 23, 2025
మహోన్నత శక్తికి ప్రతీక ‘శివుడు’

‘ఓం ప్రవరాయ నమః’ – శివుడు సర్వశ్రేష్టుడు, మహోన్నతుడు. గుణాల్లో, శక్తిలో ఆ ప్రవరుడికి సాటి లేరు. సమస్త దేవతలు, మునులు ఆయన శ్రేష్ఠత్వాన్ని కొలుస్తారు. మనం ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నా, సత్సంస్కారాన్ని పొందాలన్నా ఆయన పేరును స్మరించాలి. విజ్ఞానానికి, సద్గుణాలకు నెలవైన ఆయన అత్యుత్తమ దైవశక్తిగా, ఆదిగురువుగా పూజలందుకుంటారు. అలా కొలవడం వల్ల మనలోని అజ్ఞానమనే మలినాలు తొలగిపోతాయి. <<-se>>#SHIVANAMAM<<>>
Similar News
News December 25, 2025
దేశంలో లక్షకు పైగా పెట్రోల్ పంప్స్

ఇండియా ఇంధన రిటైల్ మార్కెట్ చైనా, US తరువాత 3వ స్థానాన్ని ఆక్రమించింది. పదేళ్లలో అవుట్‌లెట్‌లు రెట్టింపై 1,00,266కు చేరాయి. ఇందులో 29% రూరల్ ఏరియాలోనే ఉన్నాయి. దీంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతున్నాయని IOL మాజీ ఛైర్మన్ అశోక్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ సహా CNG, EV ఛార్జింగ్ స్టేషన్స్ వంటివీ అందుబాటులోకి వచ్చాయి. కాగా ఈ అంశంలో రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం 10% లోపే ఉంది.
News December 25, 2025
రోజుకు 4.08 లక్షల లడ్డూల పంపిణీ: TTD ఛైర్మన్

AP: DEC 30 నుంచి ఆరంభమయ్యే వైకుంఠ ద్వార దర్శనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ‘ప్రస్తుతం రోజుకు 4 లక్షల లడ్డూలు, 8వేల కళ్యాణోత్సవ లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నాం. వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో వీటి తయారీని పెంచుతాం. లడ్డూల నాణ్యత, రుచి పెంచాం, క్యూలైన్లలో నిరీక్షణ తగ్గించాం’ అని పేర్కొన్నారు. ఆయన లడ్డూ తయారీ, విక్రయ కేంద్రాన్ని పరిశీలించి భక్తులతో మాట్లాడారు.
News December 25, 2025
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. మందు బాబులకు అలర్ట్

TG: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మందు కొట్టి విచ్చలవిడిగా రోడ్లపై వాహనాలతో తిరిగే వారిపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు వెహికల్ సీజ్, గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌లో చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాల్లో 304 వాహనాలు సీజ్ చేసినట్లు వెల్లడించారు.
Share it


