News February 3, 2025
మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News February 3, 2025
పెద్దపల్లి బీజేపీ అధ్యక్షుడిగా సంజీవరెడ్డి
ఓదెల మండలం కొలనూర్‌కి చెందిన సంజీవ రెడ్డి బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ సంఘటన పర్వ్- 2024 ఎన్నికల నియమావళి ఆధారంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి క్ష్మీ నారాయణ సంజీవను అధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి శ్రీకాంత్ నియామక పత్రాన్ని విడుదల చేశారు. తన నియామకానికి సహకరించిన వారికి అయన కృతజ్ఞతలు తెలిపారు.
News February 3, 2025
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే రమేశ్‌కు మాతృవియోగం
వర్ధన్నపేట మాజీ MLA ఆరూరి రమేశ్ తల్లి వెంకటమ్మ మృతి చెందారు. సోమవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జఫర్ గఢ్ మండలంలోని ఉప్పుగల్ గ్రామంలో మృతి చెందగా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఆమె మృతి పట్ల పలు పార్టీలకు చెందిన నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
News February 3, 2025
ఇంగ్లండ్‌పై పంజాబీల ఊచకోత!
ఇంగ్లండ్‌పై దండయాత్ర చేసిన భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ నుంచి వచ్చిన వారు ఇంగ్లండ్ వారికి చుక్కలు చూపించడం ఇది కొత్తేమీ కాదని పోస్టులు పెడుతున్నారు. దేశానికి ఫ్రీడమ్ తీసుకొచ్చేందుకు ఆంగ్లేయులపై అప్పుడు భగత్ సింగ్, పదేళ్ల క్రితం క్రికెట్‌లో యువరాజ్ సింగ్, ఇప్పుడు అభిషేక్ బ్యాట్‌తో చుక్కలు చూపించారని చేసిన పోస్టర్ వైరలవుతోంది.