News February 3, 2025

మాంచెస్టర్ అమ్మాయితో చిట్యాల అబ్బాయి పెళ్లి

image

చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన రాజీవ్ రెడ్డి యూకేలోని మాంచెస్టర్ చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. ఆయన మాంచెస్టర్లో హోటల్ మేనేజెమెంట్ కోర్సు పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే పోలీస్ శాఖలో పనిచేస్తున్న లారెన్ ఫిషర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇద్దరూ పెద్దల సమక్షంలో హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పలువురు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News February 21, 2026

నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

image

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

News February 21, 2026

సాగర తీరానికి జలకళ.. పర్యాటకులకు ప్రకృతి విందు!

image

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ జలాశయం క్రమంగా జలకళను సంతరించుకుంటోంది. ఎగువన ఉన్న శ్రీశైలం నుండి విద్యుదుత్పత్తి ద్వారా వస్తున్న వరదతో వారం రోజులుగా సాగర్ నీటిమట్టం పెరుగుతూ పర్యాటకులకు కనువిందు చేస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే ప్రాజెక్టు నీటిమట్టం 5 అడుగులు పెరిగి ప్రస్తుతం 541 అడుగులకు చేరుకుంది. ఎగువ నుంచి ప్రస్తుతం 56,315 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.

News February 21, 2026

నల్లగొండ: బతుకుతెరువుకు వంద మార్గాలు..!

image

పనిచేయాలనే తపన ఉండాలే కానీ.. బతుకుతెరువుకు వంద మార్గాలు ఉన్నాయని నల్లగొండ యువత నిరూపిస్తోంది. స్థానికంగా ఓ మార్ట్ వద్ద డెలివరీ బాయ్స్‌గా చేరేందుకు యువత క్యూ కడుతున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణం. డెలివరీ పాయింట్ దూరాన్ని బట్టి చెల్లింపులు ఉన్నాయి. 1.3 కిలోమీటర్ల లోపు ప్రతి డెలివరీకి రూ.35, ఆ పైన దూరం ఉంటే రూ.45 చొప్పున సంస్థ అందిస్తోంది.