News March 22, 2025

‘మాంసం, కూరగాయల క్లస్టర్‌గా అనకాపల్లి జిల్లా’

image

అనకాపల్లి జిల్లాలో మాంసం, కూరగాయల క్లస్టర్‌గా ప్రభుత్వం ప్రకటించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డీడీసీ, డీఎల్ఆర్సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ తదితర ఉపాధి రంగాలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఈ రంగాల్లో వచ్చే ఏడాదికి 17% వృద్ధి సాధించే విధంగా యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

Similar News

News July 9, 2025

ఉల్లాస్-అక్షరాంద్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: కలెక్టర్

image

అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్-అక్షరాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బంగ్లాలో జిల్లాస్థాయి అధికారులతో కాన్ఫరెన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. 100 గంటల శిక్షణతో ఈ ఏడాది 97,200 నిరీక్షరాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్ది ప్రథమ స్థానంలో ఉంచాలని కలెక్టర్ సూచించారు.

News July 9, 2025

అల్లూరి జిల్లాలో అరుదైన ఎగిరే ఉడుత

image

జీకేవీధి మండలం పారికల గ్రామంలో పాంగీ చందు అనే గిరిజనుడు బుధవారం ఉదయం చేను దున్నేందుకు వెళ్లగా అక్కడ చనిపోయిన ఎగిరే ఉడత కనిపించింది. ఉడతను గ్రామంలోకి తీసుకురాగా చూసేందుకు ప్రజలు గుమిగూడారు. వాడుక భాషలో మనుబిల్లి అని పిలుస్తారని స్థానికులు వెల్లడించారు. ఎగిరే ఉడత (ఫ్లయింగ్ క్విరిల్) ఏజెన్సీ గ్రామాలలో కనిపించడం చాలా అరుదని, ఎక్కడి నుంచో ఎగిరి వెళ్తూ పడిపోయి చనిపోయిందని భావిస్తున్నారు.

News July 9, 2025

తెనాలి: ఆలయ హుండీలో రద్దైన నోట్లు

image

వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ. 500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఆరు పాత రూ.1000 నోట్లు, పది పాత రూ.500 నోట్లు వెలుగు చూశాయి. ఆర్‌బీఐ చాలా ఏళ్ల క్రితమే ఈ నోట్లను రద్దు చేసినా, దేవుడి హుండీలో ఇవి కనిపించడం చర్చనీయాంశమైంది. జనవరిలో కూడా ఇక్కడ రూ.2000 నోట్లు లభ్యమయ్యాయి.