News April 2, 2025
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం.. వార్డు సభ్యుడు మృతి

మాకవరపాలెం మండలంలో అవంతి కళాశాల ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమ బోయినపాలెంకి చెందిన వార్డు సభ్యుడు లాలం మణిబాబు మృతి చెందాడు. మాకవరపాలెం నుంచి బైక్‌పై స్వగ్రామం వెళుతుండగా అవంతి కళాశాల వద్దకు వచ్చేసరికి కళాశాల లోపల నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో మణిబాబును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 3, 2025
నారాయణపేట జిల్లాలో అమ్మాయిల వెంట పడితే అంతే..!

NRPT జిల్లాలో షీటీం సేవలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఊట్కూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. షీ టీం పోలీస్ అధికారి బాలరాజు మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల్లో ఎవరైనా అమ్మాయిలను వేధించినా, వారి వెంట పడినా, అసభ్యంగా ప్రవర్తించినా, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే షీటీం పోలీసుల నంబర్ 8712670398కి కాల్ చేయాలన్నారు.
News April 3, 2025
BREAKING: గురుకుల CET ఫలితాలు విడుదల

TG: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం FEB నెల 23న నిర్వహించిన TG CET ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకులాల్లో మొత్తం 51,408 సీట్లు ఉండగా, ఫలితాల్లో 36,334 మంది సీట్లు పొందారు. వివిధ కేటగిరీలకు చెందిన 13,130 సీట్లకు గాను త్వరలోనే ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఫలితాల కోసం ఇక్కడ <
News April 3, 2025
ప్రకాశం జిల్లా వాసులకు వాతావరణ శాఖ హెచ్చరికలు

ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.