News March 17, 2025
మాకవరపాలెం: బావిలో దూకి యువకుడి ఆత్మహత్య

మాకవరపాలెం మండలం చామంతిపురంలో ఒక యువకుడు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన దుంగల దుర్గాప్రసాద్(17) ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న మాకవరపాలెం ఎస్ఐ దామోదర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News March 17, 2025
ములుగు: ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ములుగు అదనపు కలెక్టర్ సంపత్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 19 ఫిర్యాదులు సమర్పించారని ఆయన తెలిపారు. భూసమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగ ఉపాధి, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామన్నారు.
News March 17, 2025
HYD: జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

చంచల్‌గూడ జైలులో ఉన్న యూట్యూబ్ జర్నలిస్టులు తన్వి యాదవ్, రేవతిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్‌ను ఇచ్చింది. కాగా.. పోలీసులు తన్వి యాదవ్‌తో పాటు రేవతిలను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేయగా పిటిషన్‌ను తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేసింది.
News March 17, 2025
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

☛ చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్
☛ టీచర్ల బదిలీల నియంత్రణ చట్టసవరణ బిల్లుకు ఆమోదం
☛ అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం
☛ రాజధాని భూకేటాయింపులపై క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
☛ YSR తాడిగడప మున్సిపాలిటీ పేరు తాడిగడపగా మార్పు
☛ నంబూరులోని VVITకి ప్రైవేట్ వర్సిటీ హోదా