News March 5, 2026
మాక్‌డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించిన కలెక్టర్, ఎస్పీ

జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రతా వ్యవస్థలను పరీక్షించేందుకు మార్చి 3 నుంచి 5 వరకు ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ), ఆక్టోపస్, జిల్లా పరిపాలన, పోలీసు శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ మాక్ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బంది, అధికారులను కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.
Similar News
News March 6, 2026
మా అమ్మ సిద్దిపేట నుంచే పోటీ చేస్తుంది: కవిత కొడుకు

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా అమ్మ కల్వకుంట్ల కవిత సిద్దిపేట నుంచి పోటీ చేస్తుందని కవిత కుమారుడు ఆదిత్య స్పష్టం చేశారు. సిద్దిపేటలోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆదిత్యను జాగృతి నాయకులు కలిసి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే నెలలో కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. కాగా వచ్చే ఎన్నికల్లో తాను సిద్దిపేట నుంచే బరిలో ఉంటానని కవిత చెప్పిన విషయం తెలిసిందే.
News March 6, 2026
కుంభాభిషేకంతో ఇంద్రకీలాద్రిపై ఆర్జిత సేవలు రద్దు

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కుంభాభిషేక
ఉత్సవ నిర్వహణ దృష్ట్యా ఇరోజు నుండి 9 వరకు ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను రద్దు చేసారు. ఈ 4 రోజుల పాటు అన్ని సేవలను, ప్రత్యేక పూజలను దేవస్థానమే “సర్కార్ సేవ” కింద పరోక్షంగా సేవలు నిర్వహిస్తుందని ఈఓ శీనానాయక్ అన్నారు. ఈ మూడు రోజులు భక్తులకు కేవలం ముఖ మండపం సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.
News March 6, 2026
అనకాపల్లి: రేకుల షెడ్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

ఎస్ రాయవరం(M) కొరుప్రోలు గ్రామంలోని సత్య వినాయక కొబ్బరి పీచు పరిశ్రమ స్టోరేజ్ షెడ్‌పై మరమ్మతు పనులు చేస్తుండగా గురువారం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎస్ రాయవరం గ్రామానికి చెందిన వెల్డర్ కొమ్ము నూకరాజు (50) షెడ్‌పై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలైయ్యాడు. అతనిని అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందాడని, దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ విభీషణరావు తెలిపారు.


