News May 30, 2024
మాక్లూర్: నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసిన తండ్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_52024/1717075645759-normal-WIFI.webp)
మాక్లూర్ మండలం ధర్మోరాలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిని సవితి తండ్రి గొంతు నులిమి హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సునీత అనే మహిళ అరుణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కాగా మెుదటి భర్తకు పుట్టిన పాప ఉండొద్దని సునీతతో అరుణ్ తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలోనే చిన్నారి లక్కి(4) నిద్రలో ఉండగా గొంతు నులిమి హత్య చేశాడు. అరుణ్, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Similar News
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294889526_1269-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.
News February 12, 2025
NZB: టెన్త్ అర్హతతో 42 ఉద్యోగాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294822314_728-normal-WIFI.webp)
నిజామాబాద్ డివిజన్‌లో 42 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
News February 12, 2025
చిలుకూరు బాలాజీ అర్చకుడికి దాడిలలో బోధన్ యువకుడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739269225726_71691563-normal-WIFI.webp)
హిందువులను రక్షించడానికి ఏర్పడిన రామరాజ్యం ఆర్మీ వ్యవహారంలో చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన వెలుగు చూసింది. ఈ రామరాజ్యం ఆర్మీలో బోధన్‌కు చెందిన సాయినాథ్ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశమైంది. రంగరాజన్‌పై దాడి ఘటనలు పోలీసులు సాయినాథ్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా 2022 నుంచి పని చేస్తున్నాడు. ఇదే విషయమై ఇంకా ఎవరినైనా బెదిరించాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.