News November 24, 2025

‘మాక్‌ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం

image

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపికపై వివాదం నెలకొంది. ఆదోని నెహ్రూ మెమోరియల్ పాఠశాల విద్యార్థి వంశిత తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. తాను తొలి స్థానంలో నిలవగా రెండో స్థానం విద్యార్థిని అసెంబ్లీకి సెలెక్ట్ చేశారని మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే ఆళ్లగడ్డ మాక్ ఎమ్మెల్యేగా తొలుత తనను ఎంపిక చేసి చివరకు 3వ స్థానంలో నిలిచిన విద్యార్థిని సెలెక్ట్ చేశారని విద్యార్థిని మోక్షిత ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News

News November 25, 2025

ALERT.. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం

image

AP: మలక్కా జలసంధి ప్రాంతంలోని తీవ్ర అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడిందని APSDMA తెలిపింది. ఇది నెమ్మదిగా కదులుతూ రాబోయే 48 గంటల్లో మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయంది.

News November 25, 2025

పసుపు రంగు మిర్చికి రెట్టింపు డిమాండ్

image

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు రంగు మిక్సీ రాకతో వ్యాపారం వేడెక్కింది. ఉత్తమ నాణ్యతతో మార్కెట్‌కు చేరిన పసుపు రంగు మిర్చికి వ్యాపారుల మధ్య పోటీ నెలకొనడంతో క్వింటాకు రూ.21,050 వరకు ధర పలికింది. రైతులు రకరకాల పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చినప్పటికీ, పసుపు రంగు మిక్సీపై ప్రత్యేక డిమాండ్ నెలకొనడం గమనార్హం. అధిక ధర రావడం పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

News November 25, 2025

నల్గొండ: ఆకట్టుకున్న ఇందిరమ్మ గృహప్రవేశం

image

మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి వారు ఫొటో దిగగా ఆకట్టుకుంటోంది.