News November 22, 2024
మాగనూరు ఘటన.. ఎంపీ డీకే అరుణ సీరియస్
ప్రభుత్వం అసమర్థత వల్లే మాగనూరు ఘటన జరిగిందని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఢిల్లీలో ఉన్న డీకే అరుణ ఈ ఘటనపై స్పందించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు కూడా సరైన భోజనం పెట్టకపోవడం దారుణం అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.
Similar News
News November 22, 2024
కల్వకుర్తి: 24 తేదీన గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఈ నెల 24న గద్దర్ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు నిర్మాణ కమిటీ సభ్యులు సదానందం, శేఖర్ తెలిపారు. భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, సాంస్కృతిక సారధి ఛైర్మన్, గద్దర్ కూతురు వెన్నెల హాజరవుతారని తెలిపారు. ప్రజా సంఘాల, సామాజిక వాదులు, గద్దర్ అభిమానులు హాజరు కావాలని కోరారు.
News November 22, 2024
MBNR: నియామక పత్రాలు అందజేయండి
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా JL అభ్యర్థులుగా ఎంపికైన వారు నియామక పత్రాల జారీ కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా జరుగుతున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా JL అభ్యర్థుల నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటర్ విద్యలో నాణ్యమైన విద్య అందించేందుకు తాము కృషి చేస్తామని పేర్కొంటున్నారు.
News November 22, 2024
కొల్లాపూర్: గర్భవతి హత్య..?
వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని కనిపించింది. గ్రామస్థుల వివరాలు.. పానగల్ (M) చిక్కేపల్లికి చెందిన బాలకృష్ణతో వివాహమైంది. నాగర్‌కర్నూల్ జిల్లాకి చెందిన ప్రశాంతి(21) భర్త వేధింపులకు పుట్టింటిలోనే ఉంటోంది. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త కొట్టి ఉరేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రశాంతి గర్భవతిగా ఉన్నట్లు సమాచారం. పెద్దకొత్తపల్లి ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.