News July 7, 2025
మాగనూర్: ప్రేమ పేరుతో మోసం… యువకుడిపై కేసు

ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకోమంటే యువకుడు మోసం చేసిన సంఘటన మగనూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై అశోక్ బాబు కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన నరేశ్ కొంతకాలంగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి గర్భం చేశాడు. పెళ్లి చేసుకోకపోవడంతో నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదైంది.
Similar News
News July 8, 2025
PDPL: ‘ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి’

ఈ నెల 15లోపు SC, ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సేవా కార్యక్రమాలతో కూడిన ఆధారాలు, పేపర్ క్లిప్పింగ్‌లు, ఫొటోలు, స్వచ్ఛంద సేవ సంస్థలకు చేసిన సేవలతో కూడిన ఆధారాలను షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సభ్యులకు ఎలాంటి పారితోషకాలు ఉండవని స్పష్టం చేశారు.
News July 8, 2025
మెగా DSCపై తప్పుడు ప్రచారాలు: విద్యాశాఖ

AP: మెగా DSC అభ్యర్థులు పరీక్షలపై వస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ‘కొన్ని పత్రికలు, SMలో పరీక్షలపై నిరాధార ఆరోపణలు వచ్చాయి. సాఫ్టవేర్ లోపాలు, జవాబు మార్పులు వంటి ఆరోపణలు ధ్రువీకరణ కాలేదు. అధికారిక సమాచారంలేని ప్రచారాలు నమ్మొద్దు. అభ్యర్థుల సహాయం కోసం 8125046997, 7995649286, 7995789286, 9398810958 హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి’ అని పేర్కొంది.
News July 8, 2025
MHBD: అమ్మాయిలూ.. ఆకతాయిలు ఏడిపిస్తున్నారా?

జామండ్లపల్లి జడ్పీహెచ్ఎస్‌లో షీ టీం SI సునంద ఆధ్వర్యంలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంట, బయట ఎక్కడైనా ఆకతాయిలు బాలికలను, యువతులను భయాందోళనకు గురిచేస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు సూచించారు. 8712656935కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. MHBD ఎస్పీ రామ్‌నాధ్ కేకన్ ఆదేశాల మేరకు ఈ సదస్సు నిర్వహించామన్నారు.