News January 20, 2026
‘మాఘం’ అంటే మీకు తెలుసా?

చాంద్రమానం ప్రకారం 11వ నెల మాఘ మాసం. మఖ నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే నెల కాబట్టి దీనికి ‘మాఘం’ అని పేరు వచ్చింది. ‘మఘం’ అంటే యజ్ఞం అని అర్థం. బ్రహ్మాండ పురాణం ప్రకారం.. రుషులు యజ్ఞయాగాదులు నిర్వహించడానికి ఈ మాసాన్ని అత్యంత శ్రేష్ఠమైనదిగా ఎంచుకున్నారు. ఇది శివకేశవులకు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మ ఏకాదశి, మహాశివరాత్రి వంటి గొప్ప పండుగలు ఈ మాఘ మాసంలోనే వస్తాయి.
Similar News
News February 19, 2026
ఇంటర్వ్యూతో IICTలో ఉద్యోగాలు

<
News February 19, 2026
BREAKING: రాష్ట్రంలో భూకంపం

AP: పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వినుకొండకు 20km దూరంలో, భూమికి 10km లోతులో కేంద్రం ఉన్నట్లు EMSC, NCS ధ్రువీకరించాయి. వినుకొండ, దర్శి ప్రాంతాల్లోనూ ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అయితే, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు.
News February 19, 2026
కాపర్ టీ వాడుతున్నారా?

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.


