News April 10, 2024

మాచర్ల నుంచి గుంటూరు ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ

image

మాచర్ల నుంచి గుంటూరు వరకు, గుంటూరు నుంచి మాచర్ల వరకు నడిచే రైలును తిరిగి ప్రారంభిస్తున్నట్లు గుంటూరు రైల్వే డిఆర్‌ఎం రామకృష్ణ బుధవారం తెలిపారు. 20 రోజులుగా ఈ రైలు నిలిచిపోవడంతో ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైల్వే జేఆర్‌యు సిసి మెంబర్ మద్దాల సుబ్బయ్య, గుంటూరు రైల్వే డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు నేటినుంచి ప్రారంభిస్తామన్నారు.

Similar News

News February 17, 2026

గుంటూరులో CBSE టెన్త్ పరీక్షలు షురూ

image

గుంటూరు జిల్లాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఉదయాన్నే చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.

News February 17, 2026

గుంటూరులో శాప్ లీగ్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

image

ఏపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) రూపొందించిన శాప్ లీగ్ పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రంలోని అట్టడుగు (Grassroot level) ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యంగా నూతన క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు, పాఠశాల స్థాయి విద్యార్థులు పాల్గొంటారన్నారు.