News August 16, 2024

మాచర్ల మున్సిపాలిటీ కైవసం చేసుకునున్న TDP

image

సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం నమోదు చేయడంతో మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని కౌన్సిలర్లు YCPని వీడి TDPలో చేరారు. ప్రస్తుత మున్సిపల్ ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని కలిశారు. ఇప్పటికే పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మొత్తంగా 31 మంది కౌన్సిలర్లకు గాను 20 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నట్లు సమాచారం. 

Similar News

News December 26, 2025

GNT: దిగ్గజ నిర్మాత ఏ.వి సుబ్బారావు

image

గుంటూరు జిల్లా అనంతవరంనకు చెందిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఏ.వి సుబ్బారావు తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ వంటి ఆణిముత్యాలను ఆయన నిర్మించారు. తెలుగు సినిమా స్వర్ణయుగానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి గాను తెలుగులో తొలి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. నిర్మాతగానే కాకుండా స్టూడియో అధినేతగానూ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.

News December 26, 2025

GNT: మృతిచెందిన వృద్ధురాలు మీకు తెలుసా.?

image

గుంటూరు కలెక్టరేట్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తుండగా మృతి చెందినట్లు నగరంపాలెం పోలీసులు తెలిపారు. గురువారం వృద్ధురాలు పడిపోయి ఉన్నట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారన్నారు. చికిత్స పొందుతూ మరణించిన ఆమె ఆచూకీ తెలిసిన వారు స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

News December 26, 2025

GNT: సినీ జగత్తులో శాశ్వత వెలుగు.. మహానటి సావిత్రి

image

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన మహానటి సావిత్రి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. 1935లో గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగి, సావిత్రి అంటేనే అభినయం అనే స్థాయికి చేరారు. మాయాబజార్‌లో శశిరేఖ పాత్రతో అమరత్వం పొందిన ఆమె, భావోద్వేగాలకు ప్రాణం పోసిన నటిగా సినీ చరిత్రలో నిలిచారు. @నేడు ఆమె వర్ధంతి.