News April 9, 2025

మాచర్ల: సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాల ఉపసంహరణ

image

నాగార్జునసాగర్ డ్యాం రక్షణకు ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలను కేంద్రం మంగళవారం ఉపసంహరించుకుంది. గతంలో నాగార్జునసాగర్ డ్యాం రక్షణ తెలంగాణకు చెందిన ఎస్పీఎఫ్ ఆధీనంలో ఉండేది. తరచూ నీటి విడుదల విషయంలో ఆంధ్ర, తెలంగాణ అధికారుల మధ్య ఘర్షణలు జరుగుతూ ఉండటంతో కేంద్రం జోక్యం చేసుకొని డ్యాం భద్రతను సీఆర్పిఎఫ్‌కు అప్పగించింది. బలగాలను వెనక్కి వచ్చేయాలని ఆదేశించడంతో డ్యామ్ భద్రత తెలంగాణ ఎస్పీఎఫ్ ఆధీనంలోకి వెళ్లనుంది.

Similar News

News July 9, 2025

KNR: SRR (అటనామస్) కళాశాల డిగ్రీ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

కరీంనగర్‌లోని SRR ప్రభుత్వ (అటనామస్) కళాశాల డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కె.రామకృష్ణ, SU కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డి.సురేశ్ కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీనివాస్, అధ్యాపకుల బృందంతో కలిసి బుధవారం విడుదల చేశారు. 6వ సెమిస్టర్‌తోపాటు డిగ్రీ కోర్సు ఉత్తీర్ణులైన వారు 79%, 4వ సెమిస్టర్‌లో 38%, 2వ సెమిస్టర్‌లో 30% ఉత్తీర్ణత సాధించారు.

News July 9, 2025

పాడేరు: ‘టీచర్లే లేని పాఠశాలలకు మెగా పీటీఎం అవసరమా?’

image

అల్లూరి జిల్లా వ్యాప్తంగా గల 11 మండలాల పరిధిలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునః ప్రారంభమై నేటి వరకు ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఎలా నిర్వహిస్తారని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు మాధవ్, బాబూజీ, కిషోర్ ప్రశ్నించారు. బుధవారం పాడేరులో వారు మాట్లాడారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించి గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడాలని డిమాండ్ చేశారు.

News July 9, 2025

క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. * రూ.672 కోట్ల ధాన్యం బకాయిల విడుదలకు అంగీకారం * హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం * అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు నిర్ణయం * కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు అనుమతి * నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదం