News April 24, 2025
మాచవరం: ఈతకు వెళ్లి ఇద్దరి విద్యార్థుల మృతి

మాచవరం మండలం కొత్తపాలెంలో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. ఏఎస్ఐ విజయ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన యేసు రాజు(16), జస్వంత్(9) మరణించారు. పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో ఈత కొట్టేందుకు బావిలోకి దిగారు. సరిగ్గా ఈత రాకపోవడంతో ఆ ఇద్దరు చనిపోయారు. వీరి మృతితో కొత్తపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News April 24, 2025
చంద్రమౌళి పార్థివదేహానికి నివాళి అర్పించిన పవన్ కళ్యాణ్

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన విశాఖ వాసి చంద్రమౌళికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. విశాఖలోని కనకదుర్గ హాస్పిటల్‌కి వెళ్లి చంద్రమౌళి పార్థివ దేహాంపై పూలదండ వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉగ్రవాదుల దాడుల్లో చంద్రమౌళి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తోందని పేర్కొన్నారు.
News April 24, 2025
యుద్ధానికి రెడీ అవుతున్న భారత్?

పాకిస్థాన్‌పై విరుచుకుపడేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. LoC, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్థాన్ నిబంధనలు ఉల్లంఘించడంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని (సీజ్ ఫైర్) రద్దు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అటు హిందూ, అరేబియా సముద్రాల్లో నేవీ మోహరించినట్లు వార్తలొస్తున్నాయి. INS విక్రాంత్ పాకిస్థాన్ వైపు వెళ్తోందని సమాచారం. ఇక వైమానిక దళం రఫేల్ యుద్ధవిమానాలను పలు ఎయిర్‌బేస్‌లకు తరలించింది.
News April 24, 2025
బీచ్ కబడ్డీకి ఉమ్మడి గుంటూరు జిల్లా జట్ల ఎంపిక

కాకినాడలో మే 2 నుంచి 4 వరకు జరిగే అంతర్ జిల్లా బీచ్ కబడ్డీ పోటీలకు ఉమ్మడి గుంటూరు జిల్లా పురుషులు, మహిళల జట్లు ఎంపికయ్యాయి. గురువారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన సెలెక్షన్స్‌లో 9 మంది పురుషులు, ఆరుగురు మహిళలు ఎంపికయ్యారు. అనంతరం ఇండియా క్యాంప్‌నకు ఎంపికైన గోపీచంద్‌ను సన్మానించారు. కబడ్డీ సంఘ నాయకులు, కోచ్‌లు, పీడీలు పాల్గొన్నారు.