News May 10, 2024

మాచారెడ్డి: ఉరేసుకొని ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మాచారెడ్డి మండలం తండాలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. లావుడ్య నవీన్ (21) కొద్దిరోజులుగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఆటోలు సరిగ్గా నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పులు కూడా పుట్టకపోవడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

Similar News

News January 19, 2025

NZB: రూ.382.28 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

image

నిజామాబాద్ నగరంలో రూ.382.28 కోట్లతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ తాగునీటి సమస్యను తీర్చడానికి అమృత పథకం రూ.217 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి నిర్వహణకు రూ.162.81 కోట్లు, రూ.2.47 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణం కోసం ఆయన శంకుస్థాపన చేశారు.

News January 19, 2025

ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు: కవిత

image

నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెకిలి మాటలు మాట్లాడడం మానేయాలని ఆమె సూచించారు.

News January 19, 2025

NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

image

మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్‌కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్‌లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.