News January 20, 2026
మాచారెడ్డి: విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టుకు ఎస్పీ ఫిదా!

మాచారెడ్డి (M) మర్రితండా వాసి అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Similar News
News April 5, 2026
ఎలక్షన్స్.. రూ.651 కోట్లు సీజ్: EC

బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, పుదుచ్చేరి ఎన్నికలతోపాటు 6 రాష్ట్రాల్లో బై ఎలక్షన్స్ జరిగే నియోజకవర్గాలపై ఈసీ పటిష్ఠ నిఘా ఏర్పాటుచేసింది. ఇప్పటి వరకు రూ.651 కోట్ల విలువైన లిక్కర్, డ్రగ్స్, డబ్బు, ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు ప్రకటించింది. 5,173 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నిత్యం తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. సాధారణ పౌరులకు వేధింపులు, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
News April 5, 2026
భాకరాపేట జల్లికట్టు వేడుకల్లో అపశ్రుతి

భాకరాపేట జల్లికట్టులో అపశ్రుతి చోటుచేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలం వేడుకల్లో పశువులు ఒక్కసారిగా జనాలపైకి దూసుకురావడంతో రవిచంద్ర అనే వ్యక్తి మెడలోకి పశువు కొమ్ము దిగింది. తీవ్ర గాయాలైన శ్రీనివాసులు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వేడుకలు మొదలవ్వకముందే జరిగిన ఈ ప్రమాదంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
News April 5, 2026
NLG: ఏప్రిల్‌లోనే రూ. 8.50 కోట్ల పన్ను వసూలు!

నల్గొండ నగరపాలక సంస్థ ఈ ఏడాది ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 18 కోట్ల పన్ను డిమాండ్ ఉండగా, కేవలం ఈ ఏప్రిల్ నెలలోనే రూ. 8.50 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాది మొత్తంలో వచ్చే ఆదాయంలో దాదాపు సగాన్ని ఈ ఒక్క నెలలోనే రాబట్టేలా మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక కసరత్తు చేస్తోంది.


