News August 23, 2024
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రిలీజ్‌కు బ్రేక్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం రాత్రి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఆయన రిలీజ్‌కు బ్రేక్ పడింది. కోర్టు నుంచి ఆర్డర్ కాపీలు స్టేషన్‌కు చేరడానికి ఇవాళ సమయం మించి పోవడంతో నిబంధనలు మేరకు మాజీ ఎమ్మెల్యేను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం ఉదయం లేదా మధ్యాహ్నం పిన్నెల్లి బెయిల్ పై విడుదలయ్యే అవకాశం ఉంది.
Similar News
News April 1, 2026
గుంటూరు: పన్ను వసూళ్లలో GMC రికార్డ్

గుంటూరు నగరపాలక సంస్థ 90%కి పైగా పన్ను వసూళ్లతో రికార్డు సృష్టించింది. గతేడాది రూ.152.14 కోట్లు వసూళ్లు రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.155.20 కోట్లు రాబట్టినట్లు కమిషనర్ కే.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు రూ.9 కోట్ల వసూళ్లతో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.
News April 1, 2026
గుంటూరు: నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్..!

నేటి నుంచి జిల్లాలో NTR వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అడిగినా స్పందన కరవైందంది. పాత బకాయిలివ్వకుండా 2017 రేట్లతోనే కొత్త హెల్త్ స్కీం తేవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రుల మనుగడ కష్టంగా మారిందని, తమ ఆందోళనకు ప్రజలు మద్దతివ్వాలని ఆషా కోరింది.