News December 1, 2025

మాజీ ఎమ్మెల్యే మేడా సంచలన ప్రకటన.. క్లారిటీ.!

image

గత ప్రభుత్వం చేసిన తప్పిదంతో రాజంపేట సంక్షోభంలోకి వెళ్లిందని, రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని మాజీ MLA మేడా మల్లిఖార్జున రెడ్డి పేరుతో ఓ ప్రకటన వైరల్ అయింది. అన్నమయ్య జిల్లాలోకి బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా కలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరినట్లు ఉంది. దీనిపై ఆయనను Way2News వివరణ కోరగా.. ఆ ప్రచారానికి తనకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Similar News

News April 15, 2026

ముగింపు దశలో యుద్ధం.. కానీ: ట్రంప్

image

ఇరాన్‌తో రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టెహ్రాన్‌తో యుద్ధం ముగింపు దశకు చాలా దగ్గరగా ఉందన్నారు. అయితే అమెరికా పని ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. ‘వారు ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడే మా బలగాలను ఉపసంహరించుకుంటే ఆ దేశాన్ని తిరిగి నిర్మించుకోవడానికి 20 ఏళ్లు పడుతుంది’ అని పేర్కొన్నారు.

News April 15, 2026

ప.గో: ప్రేమ విఫలమై యువకుడు సూసైడ్!

image

భీమవరం కొత్త బస్టాండ్ వద్ద కృష్ణా జిల్లా బంటుమిల్లి(M) మల్లిపూడికి చెందిన రాజేశ్(23) ఈనెల 3వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించగా ఈనెల 13న మృతి చెందారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ విఫలం కావడమే ఆత్మహత్యకు కారణమని తెలిపారు.

News April 15, 2026

నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.