News January 12, 2026

మాజీ మంత్రి కన్నుమూత

image

AP: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కన్నుమూశారు. మెదడులో రక్తం గడ్డ కట్టే సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి 4 సార్లు(1985, 89, 94, 99) టీడీపీ తరఫున పోటీ చేసి MLAగా గెలిచారు. ఎన్టీఆర్ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. 2024 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Similar News

News January 27, 2026

ధాన్యం నిల్వలో ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ధాన్యాన్ని పరిశుభ్రమైన, పొడి గోనె సంచుల్లో నిల్వ చేయాలి. సంచులు గోడల నుంచి నేల నుంచి తేమ పీల్చుకోకుండా జాగ్రత్త పడాలి. ధాన్యాన్ని 1-2 అడుగుల ఎత్తు గల దిమ్మల మీద గాని బెంచీల మీద గాని పెడితే నేలలో తేమను సంచులు పీల్చుకోవు. కీటకాల నుంచి ధాన్యం రక్షణకు నిపుణుల సూచన మేరకు అప్పుడప్పుడు పొగబెట్టడం మంచిది. ఎలుకలను కట్టడి చేయకుంటే అవి ధాన్యాన్ని తినేస్తూ వాటి విసర్జనలు, వెంట్రుకలతో కలుషితం చేస్తాయి.

News January 27, 2026

మాట తప్పడం, మడమ తిప్పడం TDP రక్తంలోనే లేదు: లోకేశ్

image

AP: పేదరికం లేని సమాజం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ కమిటీల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం టీడీపీ రక్తంలోనే లేదని చెప్పారు. ‘పార్టీనే అందరికీ అధినాయకత్వం. చంద్రబాబు సేనాధిపతి. మనమంతా ఆయన సైనికులం. సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా చంద్రబాబు నడిపిస్తున్నారు’ అని తెలిపారు.

News January 27, 2026

వీరు కాఫీ తాగితే ప్రమాదం

image

రోజూ తగినంత మోతాదులో కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. గర్భవతులు, బాలింతలు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. ఒకవేళ తాగినా 200 మిల్లీ లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు, యాంగ్జైటీ సమస్యలు ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.