News February 8, 2026
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కన్నీళ్లకు ఓట్లు పడతాయా..?

జగిత్యాలలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్లో దొంగలు పడ్డారని, తమ నోటికాడి అన్నం లాగేసుకున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్‌ను ఉద్దేశించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు ఓదార్చే క్రమంలో జీవన్ రెడ్డి కంటతడి పెట్టారు. అయితే, జీవన్ రెడ్డి కన్నీళ్లకు ఓట్లు రాలుతాయో లేదో ఫలితాల వరకు వేచిచూడాలి.
Similar News
News February 18, 2026
ఈశాన్య మూలలో వాస్తు దోషం ఉంటే?

ఈశాన్యం లోపిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘జ్ఞాన సముపార్జనలో ఆటంకాలు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. ఇలాంటి స్థలంలో ఉంటే సమాజానికి, బంధువులకు దూరంగా ఒంటరిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. లభించాల్సిన అవకాశాలు చేజారిపోతాయి. ఈశాన్య విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. నిపుణుల సలహాతో సరైన మార్పులు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 18, 2026
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తోన్న భవిత సెంటర్‌ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించారు. పనులను వేగంగా, నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ర్యాంపు వంటి వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News February 18, 2026
రాష్ట్రస్థాయి క్రీడల్లో ఆదిలాబాద్ చిన్నారుల ప్రభంజనం

రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల ఆటల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ పోటీల కోసం జిల్లా నుంచి 26 మంది విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లగా, వారు పాల్గొన్న దాదాపు అన్ని విభాగాల్లోనూ సత్తా చాటారు. వారిని కలెక్టర్ అభినందించారు.


