News February 18, 2026

మాజీ మంత్రి ముద్రగడతో గుడివాడ అమర్నాద్ భేటీ

image

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కలిశారు. మంగళవారం కిర్లంపూడిలోని వారి నివాసంలో ముద్రగడతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు అంబటి రాంబాబు అరెస్టుపై ఇరవురు చర్చించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు, బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు.

Similar News

News February 21, 2026

అల్లూరి జిల్లాలో ఏడాదిగా జేసీ ఖాళీ

image

అల్లూరి జిల్లాలో సబ్ కలెక్టర్, ఆర్‌వో, పోస్టులు 5 నెలలుగా ఖాళీగా ఉన్నాయి. జాయింట్ కలెక్టర్ పోస్టు దాదాపు ఏడాదిగా భర్తీ కాలేదు. ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజకు JC ఇన్‌చార్జ్ బాధ్యతలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (SDC) ఎంవీఎస్ లోకేశ్‌కు RDO అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మరో అధికారికి ఇన్‌‌ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. కీలక పోస్టులు ఖాళీగా ఉండటంతో పరిపాలనపై ప్రభావం పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

మదనపల్లె: కులవర్ధన్ తల్లి కోసం వెతుకులాట

image

మదనపల్లెలో బాలిక హత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. A1 కులవర్ధన్ చనిపోయిన విషయం తెలిసిందే. A2గా అతని తల్లి అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు. ఆమెను పట్టుకోవడానికి రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోందన్నారు.