News January 13, 2026

మాజీ మంత్రి సతీమణి లక్ష్మీదేవి కన్నీటి పర్యంతం

image

దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవిని ఓదార్చారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి వివాహాన్ని తానే దగ్గరుండి చేయించానన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించలేదని బావోధ్వేగానికి గురయ్యారు.

Similar News

News February 6, 2026

SKLM: వందల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతి..అడ్డుకట్టకు అధికారుల చర్యలు

image

శ్రీకాకుళం జిల్లాకు 193 కి.మీల సముద్ర తీరం ఎచ్చెర్ల-ఇచ్ఛాపురం వరకు వ్యాపించి ఉంది. తీరాల్లో వందల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల మృతి ఆందోళన కలిగిస్తోంది. జాలర్లు వాడుతున్న స్కిడ్, నానాజాతి, గిల్లెట్, టేకు వలలతో పాటు మెకనైజ్డ్ బోట్లే తాబేళ్ల మృత్యువాతకు కారణమని ఆ శాఖాధికారులు నిర్ధారించారు. వీటి మృతికి అడ్డుకట్ట వేసేందుకు మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని ఆ శాఖ ఏడీ సత్యనారాయణ అన్నారు.

News February 6, 2026

ఎచ్చెర్ల: ఉపాధి కోర్సులకు డిమాండ్..ప్రారంభానికి చర్యలెప్పుడో?

image

ఎచ్చెర్లలోని బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీలోని 2025లో పిలాసఫీ, జియాలజీ, జియో ఫిజిక్స్‌ కోర్సులను ప్రారంభించగా జీరో అడ్మిషన్లు నమోదయ్యాయి. ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల నిర్వహణకు పీజీ సెట్ షెడ్యూల్‌ ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 6 నుంచి రిజిస్ట్రేషన్లు, మే 5, 8,9,10, 11 తేదీల్లో ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్షలు జరుగుతాయి. అయితే ఉపాధి, డిమాండ్ కోర్సులకు జిల్లాలోని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

News February 6, 2026

మందస వాసుదేవ ఉత్సవాలకు వెళ్తున్నారా..ప్రయాణ మార్గ మీదే:

image

మందసలో వాసుదేవుడి 17వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 7-13వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలకు వెళ్లాలనుకున్న భక్తుల ప్రయాణ మార్గాలు చూస్తే.. శ్రీకాకుళం-ఇచ్ఛాపురానికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి హరిపురంలో దిగాలి. అక్కడి నుంచి ఐదు కి.మీటర్ల దూరంలోని వాసుదేవ ఆలయానికి బస్సు, ఆటోల్లో నేరుగా చేరుకోవచ్చు. రైళ్లలో వచ్చే వారు పలాస రైల్వే స్టేషన్‌లో దిగి బస్సుల్లో, పాసింజర్ ట్రైన్స్‌లో మందసకు వెళ్లాలి.