News February 6, 2025

మాజీ మంత్రి హరీశ్ రావును కలిసిన సత్యవతి రాథోడ్

image

మాజీ మంత్రి హరీశ్ రావును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తనకు శాసనమండలిలో బీఆర్ఎస్ విప్‌గా అవకాశం కల్పించినందుకు గాను సత్యవతి రాథోడ్ హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజల సమస్యలపై శాసనమండలిలో గళం విప్పాలని హరీశ్ రావు సత్యవతి రాథోడ్‌కు సూచించారు.

Similar News

News February 25, 2026

గట్ హెల్త్‌కు ఇవి సూపర్ ఫుడ్స్

image

ఆరోగ్యంగా ఉండాలంటే గట్ హెల్త్ చాలా ముఖ్యం. అందుకే రోజూ ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, ప్రోబయోటిక్స్ ఉండే పెరుగు, కిమ్చీ వంటివి తీసుకోవాలి. ఉడికించి చల్లార్చిన చిలగడదుంపలు, కొంచెం నెయ్యి పేగులకి చాలా మంచివి. అలాగే కలోంజీ టీ తాగడం వల్ల కడుపులో మంట తగ్గుతుంది. డైట్‌లో ఫైబర్ చేర్చుకునేటప్పుడు ఒక్కసారిగా కాకుండా మెల్లగా పెంచడం మంచిది.

News February 25, 2026

మెదక్ పోలీసులకు 6 Medals

image

తెలంగాణ పోలీస్ ఆధ్వర్యంలో సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన 4వ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో మెదక్ పోలీసులు 6 రజత పతకాలు సాధించారు. టెన్నిస్‌లో రాథోడ్ రమేశ్ సింగిల్స్, డబుల్స్, గ్రూప్ ఈవెంట్స్‌లో హ్యాట్రిక్ రజతాలు గెలిచారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు విజేతలను సత్కరించి అభినందించారు. కబడ్డీలో భవాని, వీణ, సుష్మ జట్టును మూడో స్థానానికి తీసుకువచ్చారు.

News February 25, 2026

AI పుణ్యమా అని పెరిగిన ఆదాయం!

image

AI వల్ల 40%కి పైగా భారతీయ ఉద్యోగుల ఆదాయం పెరిగిందని బ్యాంక్‌బజార్ నివేదిక వెల్లడించింది. 22-45 ఏళ్ల మధ్య వయస్సు గల శాలరీడ్‌లో ఈ మార్పు కనిపిస్తోంది. అయితే ఐదుగురిలో ఒకరు AI వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయులు మొదటి ప్రాధాన్యం ఆరోగ్యానికి ఇస్తుండగా.. తర్వాత సొంత ఇల్లు, పిల్లల చదువును కీలకంగా భావిస్తున్నారు.