News January 28, 2025

మాజీ సీఎం ఫొటోతో సర్టిఫికెట్.. కార్యదర్శి సస్పెండ్

image

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫొటో ఉన్న ఫాం డెత్ సర్టిఫికెట్ జారీ చేసిన టి.నర్సాపురం కార్యదర్శి జి. లక్ష్మీనారాయణ‌ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన హై సెక్యూరిటీ ఫాం సర్టిఫికెట్ జారీ చేయాల్సి ఉంది. నిర్దేశించిన ఫాంలో పాత ఫాం కలవడం, రాత్రిపూట సర్టిఫికెట్ జారీ చేయడంతో పొరపాటున పాత ఫాం పై సర్టిఫికెట్ జారీ అయిందని కార్యదర్శి వివరణ ఇచ్చారు.

Similar News

News November 13, 2025

రేపటి కోసం..

image

జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు రాష్ట్రం మొత్తం రేపటి కోసం ఎదురు చూస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు రేపు ఉదయం మొదలుకానుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టినా ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారనేది EVMలు తేల్చనున్నాయి. అటు బిహార్‌లోనూ రేపు ఓట్ల లెక్కింపు జరగనుండగా ఫలితాలపై ఆ రాష్ట్రంతో పాటు దేశ ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.

News November 13, 2025

నాగర్‌కర్నూల్: ‘పాఠశాల విద్యార్థులను బయటికి తీసుకెళ్లరాదు’

image

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పాఠ్యపుస్తకాల కోసం ఆటోలో వెళ్లిన విద్యార్థులు గాయపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పాఠశాల విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల బయటికి తీసుకెళ్లరాదని బుధవారం తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

News November 13, 2025

పిట్లం: ఎదురుగా వాహనం వస్తే అంతే సంగతులు!

image

బిచ్కుంద నుంచి బాన్సువాడ, అలాగే పిట్లం నుంచి బాన్సువాడ వెళ్లే రహదారులపై రైతులు రెండు వైపులా ధాన్యాన్ని ఆరబెట్టడంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మధ్యలో కేవలం కొంత భాగం మాత్రమే మిగలడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు కనిపించక ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.