News March 13, 2026

మాజీ DGP HJ దొర కన్నుమూత

image

ఉమ్మడి ఏపీ డీజీపీ HJ దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. 1943లో శ్రీకాకుళంలో జన్మించిన దొర.. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేశారు. 1965 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. కేంద్రంలో విజిలెన్స్‌ అధికారిగా, CISFకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌‌గా పనిచేశారు. పదవిలో ఉండగా.. ఆయన్ని చంపేస్తామని మావోయిస్టులు అప్పట్లో బెదిరించారు.

Similar News

News April 5, 2026

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు

image

శ్రీకాకుళం జడ్పీ సీఈఓగా వెంకట్రామన్ బాధ్యతలు స్వీకరించారు. రెండు రోజుల క్రిందట ప్రభుత్వం ఆయన్ను విజయనగరం నుంచి బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. తనకు శ్రీకాకుళం జిల్లాలో ఎంపీడీవోగా, ఇతర శాఖలలో పనిచేసిన అనుభవం ఉందని వెంకట్రామన్ పేర్కొన్నారు. జడ్పీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

News April 5, 2026

రత్నమైనా, పద్యమైనా.. విలువ దేనికంటే?

image

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టడేలా?
చాటు పద్యమిలను చాలదా యొక్క
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: శ్రేష్ఠమైన నీలి రంగు రత్నం ఒక్కటి ఉన్నా చాలు. దానికి ఎంతో విలువ ఉంటుంది. తళతళ మెరిసే రాళ్లు తట్టెడు ఉన్నా ఉపయోగం లేదు. అలాగే రసవంతమైన, అర్థవంతమైన పద్యం ఒక్కటున్నా చాలు. వేల సంఖ్యలో అర్థం లేని పద్యాలతో మంచి జరగదు.<<-se>>#PADHYAM<<>>

News April 5, 2026

TG EAPCETకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే

image

తెలంగాణ ఈఏపీసెట్ దరఖాస్తుల (లేట్ ఫీజు లేకుండా) గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2,89,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 53.34% మంది అమ్మాయిలు, 46.66% మంది అబ్బాయిలు ఉన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమింగ్‌కు 2,03,167 అప్లికేషన్లు వచ్చాయి. నేటి నుంచి ఈ నెల 10 వరకు రూ.250 లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు EAPCET <>వెబ్‌సైట్<<>> చూడండి.