News March 2, 2025

మాజీ MLA వన్నాల శ్రీరాములు సతీమణి మృతి

image

వర్ధన్నపేట మాజీ MLA, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకుడు, కర్ణాటక ఇన్‌ఛార్జి వన్నాల శ్రీరాములు సతీమణి వన్నాల విజయలక్ష్మి(70) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతిపట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు, పలు పార్టీల కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News March 3, 2025

WGL: మక్కలు, పల్లికాయ ధరలు ఎలా ఉన్నాయంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు ఈరోజు చిరుధాన్యాలు తరలివచ్చాయి. ఈ క్రమంలో మొక్కజొన్న, పల్లికాయ ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు(బిల్టి) క్వింటాకు రూ.2,355 పలికింది. గత వారంతో పోలిస్తే మక్కల ధర తగ్గింది. అలాగే పచ్చి పల్లికాయ క్వింటాకి రూ.5,500 ధర రాగా.. సూక పల్లికాయకి రూ.7,500 ధర వచ్చింది.

News March 3, 2025

వరంగల్: అతిపెద్ద రన్‌‌ వే ఉన్న ఎయిర్‌పోర్ట్ మనదే!

image

మామునూర్ విమానాశ్రయాన్ని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ వ్యాపారాల కోసం 1930లో నిర్మించారు. నిజాం కాలంలో దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్‌ వే కలిగిన ఎయిర్‌పోర్ట్ కూడా మనదే. చైనాతో యుద్దం సమయంలోనూ మన ఎయిర్‌‌పోర్ట్ సేవలందించింది. మాజీ ప్రధాని నెహ్రూ సైతం ఓసారి ఈ ఎయిర్‌పోర్టులో దిగారు. మరి ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 2, 2025

నల్లబెల్లి: అర్ధ శతాబ్ద అపూర్వ కలయిక

image

1975 సంవత్సరంలో ఏడో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థులు కలుసుకొని బాల్యంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో దేవా, మురళి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!