News January 2, 2026

మాటపై ఉంటారా? టికెట్ రేట్స్ పెంచుతారా?

image

TG: పుష్ప 2 విషాదం తర్వాత సినిమాల టికెట్ రేట్స్ పెంచమని CM రేవంత్ అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఆ తర్వాత పలు మూవీస్ రేట్ పెంపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇటీవల అఖండ-2కు ధరలు పెంచగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తనకు తెలియకుండా అధికారులే ఆదేశాలిచ్చారని, ఇకపై ఇలా జరగదని మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఇప్పుడు సంక్రాంతి బరిలోని ‘రాజాసాబ్, మన శంకర వరప్రసాద్‌గారు’లకూ ఇది వర్తిస్తుందా? చూడాలి.

Similar News

News January 2, 2026

లొంగిపోయిన దేవా

image

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక నేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మరో 15 మంది మావోలతో కలిసి ఆయన సరెండర్ అయ్యారు. దేవాపై రూ.50లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు.

News January 2, 2026

ట్రాలీలు.. పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఘోరం

image

సూపర్ మార్కెట్ల Cart/ట్రాలీ హ్యాండిల్స్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ సర్వేలో వెల్లడైంది. E.కోలి సహా పలు ప్రమాదకర బ్యాక్టీరియాలు వాటిపై కన్పించాయట. అలాంటి వాటిపై పిల్లలను కూర్చోబెట్టడం అనారోగ్యకరమని పరిశోధకులు హెచ్చరించారు. సూపర్ మార్కెట్లకు సొంత బ్యాగ్స్ తీసుకెళ్లడం బెటర్ అని సూచించారు. ట్రాలీ పట్టుకోవడం తప్పనిసరైతే శానిటైజర్ వంటివి స్ప్రే చేసి వాడాలన్నారు.
Share It

News January 2, 2026

కనురెప్పలకూ చుండ్రు

image

శీతాకాలంలో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొందరిలో చుండ్రు కనురెప్పలపై కూడా ఏర్పడుతుంది. దీనివల్ల కళ్లు ఎర్రబడటం, లాషెస్ ఊడిపోవడంతో పాటు కండ్లకలక, కార్నియా వాపు వంటి సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. ఇలా కాకుండా ఉండాలంటే రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు గోరువెచ్చటి బాదం నూనె రాసి మర్దనా చెయ్యాలి. అలాగే కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌ కలిపి రాసినా ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.