News November 5, 2024
మాడుగుల అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు: చంద్రబాబు

మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపట్టిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Similar News
News November 4, 2025
కేజీహెచ్‌లో హీమోడయాలసిస్ యంత్రాల ఏర్పాటు

కేజీహెచ్‌లోని ఎస్ఎస్ బ్లాక్ నెఫ్రాలజీ వార్డులో 9 హీమోడయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఓ కంపెనీ CSR నిధుల నుంచి రూ.2 కోట్లతో ఈ యంత్రాలను కేజీహెచ్‌కు అందించింది. కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బుధవారం నుంచి వీటిని అందుబాటులోకి తేనున్నారు.
News November 4, 2025
కంచరపాలెంలో 7న జాబ్ మేళా

కంచరపాలెంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 7 కంపెనీలు పాల్గొనున్నాయి. టెన్త్,ఇంటర్, ఐటీఐ, డిగ్రీ చదివిన 18 నుంచి 33 సంవత్సరాలలోపు యువతీ, యువకులు అర్హులు. ఆసక్తి కలవారు https://www.ncs.gov.in, https://employment.ap.gov.in లో వివరాలు నమోదు చేసుకొని నవంబర్ 7న ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో హాజరు కావాలి.
News November 4, 2025
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.


