News April 17, 2024
మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మారనున్నారా..?

మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాదరావును తప్పించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు ఆసీటు కేటాయిస్తారని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ తరుణంలో రేపు(గురువారం) మాడుగులలో బండారు పర్యటించనున్నట్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పీవీజీ కుమార్, మాజీ MLA గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. ఆయన పర్యటన నేపథ్యంలో కార్యకర్తల్లో చర్చ మొదలైంది. కాగా.. ఆ సీటుపై రేపో ఎల్లుండో స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.
Similar News
News October 8, 2025
వైజాగ్‌కు మణిహారం ‘బీచ్ కారిడార్’

విశాఖ తీరప్రాంతానికి సరికొత్త అందాలు అద్దే ‘బీచ్ కారిడార్’ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భీమిలి వరకు 6 వరుసల రహదారిగా విస్తరించడంతో పాటు, ప్రపంచస్థాయి పర్యాటక వసతులు, హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
News October 8, 2025
ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు పోటీపడి పనిచేయాలి: కలెక్టర్

ఆదర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు పోటీపడి పనిచేయాలని ఇటీవల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయలను ఉద్దేశించి కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు మధురువాడలో ఏర్పాటు చేసిన ఇండక్షన్ ట్రైనింగ్ శిబిరాన్ని విశాఖ కలెక్టర్ బుధవారం సందర్శించారు. కలకాలం విద్యార్థులు మిమ్మల్ని గుర్తుంచుకునేలా వినూత్న రీతిలో బోధించాలని సూచించారు.
News October 8, 2025
అంతా అయ్యాక ఎంట్రీ ఇచ్చిన వైసీపీ..!

పెదగంట్యాడలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయసేకరణలో స్థానిక YCP నాయకుల తీరు చర్చనీయాంశమయ్యింది. అధికారులు రాకముందే స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు, 64వవార్డు కార్పొరేటర్ గోవింద్ రెడ్డి(జనసేన), 75వ కార్పొరేటర్ పూలి లక్ష్మీభాయి(TDP) సభా ప్రాంగణానికి చేరుకుని <<17947721>>ఆందోళనలో<<>> పాల్గొన్నారు. అయితే అంతా అయ్యాక గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జ్ తిప్పల దేవాన్‌రెడ్డి స్థానిక నాయకులతో ఎంట్రీ ఇచ్చారు.