News September 19, 2025

మాతా శిశు మరణాలను జీరో స్థాయికి తీసుకురావాలి: కలెక్టర్

image

జిల్లాలో మాతా-శిశు మరణాలను గణనీయంగా తగ్గించి జీరో స్థాయికి తీసుకురావాలని, వైద్య, స్త్రీ శిశు సంక్షేమ అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాతా-శిశు మరణాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడంపై పూర్తి దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News September 19, 2025

కేసీఆర్‌కు ఉసురు తాకి కూతురు దూరమైంది: రేవంత్ రెడ్డి

image

TG: ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమం పేరుతో ఆయన ఎంతో మంది యువతను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ ఉసురు తాకి కూతురు(కవిత) దూరమైందని వ్యాఖ్యానించారు. గతంలో తననూ కూతురి పెళ్లికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు.

News September 19, 2025

వారాహి పీఠం కాదు.. వారాహి దేవస్థానం

image

కాకినాడ రూరల్ కొవ్వూరులో వివాదస్పదమైన వారాహి పీఠంను ఇటీవల దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం వారాహి పీఠం బోర్డు తొలగించి వారాహి దేవస్థానంగా అధికారులు నామకరణం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉండే ఆలయాలను దేవస్థానాలుగా పిలుస్తారని.. అందుకే పీఠం పేరు తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.

News September 19, 2025

కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

image

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.