News March 21, 2025
మాదకద్రవ్యాలు అరికట్టేందుకు సిద్ధం: సీపీ

మినిస్టరీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్&గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ వారి సహకారంతో డ్రగ్స్ అబ్యూస్‌పై పోలీస్ సిబ్బంది అధికారులకు సీపీ రాజశేఖర్ బాబు శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు యువతను పట్టి పీడిస్తున్నాయన్నారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సూచించారు.
Similar News
News March 22, 2025
నారాయణపేట: మే 10న మీ కోసమే..!

మే 10న జరిగే లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ పోలీస్, ఎక్సైజ్, కోర్టు అధికారులు చెప్పారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కోర్టు సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ నిర్వహించారు. లోక్ అదాలత్ కార్యక్రమంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని అన్నారు. డీఎస్పీ లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.
News March 22, 2025
బల్లులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఇంటి గోడలపై నెమలి ఈకలను అంటించండి. వెల్లుల్లి రిబ్బల్ని గదులలో ఉంచితే వాటి వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి అవి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెట్టండి. నల్ల మిరియాలను నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. గుడ్డు పెంకుల్ని బల్లులున్న ప్రదేశాల్లో ఉంచండి. నాప్తలీన్ గోలీల వాసన బల్లులకు పడదు. వీటితో పాటు ఇంటిలో బూజు చెత్త లేకుండా క్లీన్‌గా ఉంచండి. తద్వార బల్లులు రాకుండా ఉంటాయి.
News March 22, 2025
ట్రాన్స్‌జెండర్ MURDER.. మహబూబ్‌నగర్‌లో నిరసన

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ట్రాన్స్‌జెండర్ హత్యకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ట్రాన్స్‌జెండర్లు శుక్రవారం నిరసన తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల అధ్యక్షురాలు సుకన్య మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష మాని, తమ సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ట్రాన్స్‌జెండర్ హత్యకు కారణమైన నిందితుడిని ఉరితీసి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు.