News August 29, 2025

మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సతీష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 29, 2025

ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం

image

ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దీనివల్ల యూనివర్సిటీ పరిధిలో ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) డిగ్రీ కోర్సులు, అలాగే ఒక సంవత్సర డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయని వీసీ గంగాధర్ తెలిపారు.

News August 29, 2025

ANU: దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూజీసీ, డెబ్ 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. వివరాలకు www.anucde.info వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

News August 29, 2025

ANU: డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూన్/జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 5వ, 6వ సెమిస్టర్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం యూనివర్సిటీ వీసీ కె.గంగాధర్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 4,292 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో www.anu.ac.in చూడవచ్చని తెలిపారు.